KKR vs RCB: చెలరేగిన కోల్‌కతా బౌలర్లు..ఆర్‌సీబీ 92 ఆలౌట్‌

తాజా వార్తలు

Updated : 20/09/2021 21:32 IST

KKR vs RCB: చెలరేగిన కోల్‌కతా బౌలర్లు..ఆర్‌సీబీ 92 ఆలౌట్‌

ఇంటర్నెట్ డెస్క్‌: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమవడంతో ఆర్‌సీబీ 18.6 ఓవర్లకు ఆలౌటైంది. ఓపెనర్ దేవదత్‌ పడిక్కల్(22) టాప్ స్కోరర్. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరుకు రెండో ఓవర్‌లోనే గట్టి షాక్‌ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 1.4 ఓవర్‌కు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ(5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.తర్వాత వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌(16)తో కలిసి దేవదత్‌ పడిక్కల్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.ఫెర్గూసన్‌ వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతికి పడిక్కల్‌ దినేశ్‌ కార్తీక్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత ఆర్‌సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది.

రసెల్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో భరత్(16), డివిలియర్స్‌(0) ఔటయ్యారు. ఈ క్రమంలో పది ఓవర్లకు ఆర్‌సీబీ 54/4తో నిలిచింది. వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్‌లో మాక్స్‌వెల్(10), హసరంగ(0) పెవిలియన్‌ చేరారు. కైల్‌ జేమీసన్‌(4), సచిన్‌ బేబీ(7) కూడా నిరాశపర్చారు.హర్షల్‌ పటేల్‌(12) రెండు ఫోర్లు బాది ఫెర్గూసన్‌ వేసిన 16.3 ఓవర్‌కు క్లీన్‌ బౌల్డయ్యాడు.సిరాజ్‌(8)ని రసెల్ ఔట్ చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్ మూడు వికెట్లతో రాణించారు.ఫెర్గూసన్‌ రెండు, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని