KL Rahul: స్ట్రోక్‌ ప్లేయర్‌ వచ్చేస్తున్నాడు!
close

తాజా వార్తలు

Published : 25/05/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KL Rahul: స్ట్రోక్‌ ప్లేయర్‌ వచ్చేస్తున్నాడు!

ముంబయి: టీమ్‌ఇండియాకు శుభవార్త! స్ట్రోక్‌ ప్లేయర్ కేఎల్‌ రాహుల్‌ వేగంగా కోలుకుంటున్నాడు. జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్స్‌కు ఇంకా నెల రోజుల గడువు ఉండటంతో అక్కడికెళ్లాక కేఎల్‌ సాధన చేస్తాడని తెలుస్తోంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతుండగా కేఎల్‌ రాహుల్‌కు శస్త్రచికిత్స జరిగింది. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అపెండిసైటిస్‌ అని తెలియడంతో వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజులకే కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూడటంతో లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. రాహుల్‌ను ఎంపిక చేసినప్పటికీ ఫిట్‌నెస్ నిరూపించుకొంటేనే వెళ్తాడని స్పష్టంచేశారు.

‘రాహుల్‌ చాలా బాగున్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు. జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్తాడు’ అని అతడి సన్నిహిత వర్గాలు మీడియాకు చెప్పాయి. ‘న్యూజిలాండ్‌తో ఫైనల్స్‌కు దాదాపుగా నెల రోజుల సమయం ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ సిరీస్‌ మొదలయ్యేందుకు ఒకటిన్నర నెల ఉంటుంది. గతంలోనూ టీమ్ఇండియా ఇలా చేసింది. గాయపడ్డ వృద్ధిమాన్‌ సాహాను ఆస్ట్రేలియా తీసుకెళ్లింది. అతనక్కడే కోలుకొని సాధన చేశాడు’ అని వారు మీడియాకు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని