close

తాజా వార్తలు

Updated : 19/01/2021 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉమాపై కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీక్షకు పోలీసులు ఒప్పుకోరని తెలిసే ఉమా దీక్ష నాటకమాడారని విమర్శించారు. దేవినేని ఉమాకు దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దామన్నారు. అక్కడే కొట్టకపోతే తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని కొడాలి నాని స్పష్టం చేశారు. బహిరంగ చర్చకు సిద్ధమని తాను రాత్రి నుంచి ఉమాకు పది సార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదన్నారు.

మరో వైపు కొడాలి నాని వ్యాఖ్యలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. దేవినేని ఉమాను అరెస్టు చేయడం దారుణమన్న ఆయన ప్రజా స్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న ఉమాను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో ఎన్నో ప్రధాన సమస్యలు ఉన్నా పరిష్కరించకుండా.. ప్రజలు దాడి చేస్తారనే భయంతో రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

ఇవీ చదవండి ...

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు 

ప్రజల పక్షాన మాట్లాడితే దాడులా: చంద్రబాబు



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని