
తాజా వార్తలు
సోదరా.. త్వరలోనే కలుస్తా: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ అరుదైన వ్యాధి కారణంగా రెండు కాళ్లూ పోగొట్టుకున్న కాగజ్‌నగర్‌కు చెందిన కలకోట అభినేష్ అనే వ్యక్తికి కృత్రిమ కాళ్ల అమరికకు సాయం చేశారు. ఈ విషయంపై బాధితుడు ట్విటర్ ద్వారా కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘కేటీఆర్ సర్ మీకు ధన్యవాదాలు. మీరు నా ట్వీట్‌కు స్పందించడం కారణంగా నేను కృత్రిమ కాళ్లను పొందగలిగాను. ఈ రోజు నేను నడవడం ప్రారంభించాను. మిమ్మల్ని కలవడానికి నేను నడుచుకుంటూ రాగలననే నమ్మకం నాకుంది. థ్యాంక్యూ సర్’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు కేటీఆర్ తిరిగి స్పందిస్తూ.. ‘సోదరా.. మీరిలా నడవడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం పూర్తైన వెంటనే మిమ్మల్ని కలుస్తాను’ అని బదులిచ్చారు.
కాగా హైదరాబాద్‌కు చెందిన కలకోట అభినేష్ అనే వ్యక్తి ఓ అరుదైన వ్యాధి కారణంగా తన రెండు కాళ్లూ కోల్పోయారు. చికిత్స కోసం రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని.. సాయం చేయాలని గతంలో మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దానికి కేటీఆర్ స్పందించారు. ఆయన స్పందనతో బాధితుడు ప్రోస్తటిక్ లింబ్స్ పొందగలిగాడు.