close

తాజా వార్తలు

Updated : 24/11/2020 12:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపా..దేశాన్ని అమ్మేస్తోంది: కేటీఆర్‌

హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ భారతదేశాన్ని అమ్మేస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారత దేశంలో ముస్లింలపై భాజపాకు ఎంత విధ్వేషం ఉందో అందరికీ అర్థమవుతోందన్నారు. లోయర్‌ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది భాజపా కాదా?అని ప్రశ్నించారు. ఇటీవల తెరాసపై ఛార్జిషీట్‌ విడుదల చేసిన భాజపాకు కేటీఆర్‌కు 50 ప్రశ్నలు సంధించారు.
‘‘పేకాట క్లబ్‌లు మూసివేయించినందుకా మాపై ఛార్జిషీట్‌? లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు భాజపాపై ఛార్జిషీట్‌ వేయాలి. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్‌ వేయాలి. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు భాజపాపై రైతులు ఛార్జిషీట్‌ వేయాలి. పెట్టు బడుల ఉపసంహరణ దేశ భవిష్యత్‌ కోసమా.. గుజరాత్‌ పెద్దల కోసమా? ఐటీఐఆర్‌ రద్దు చేసింది ఎవరు? ఆరేళ్ల లో హైదరాబాద్‌కు భాజపా ఏం చేసిందో చెప్పగలరా? వేలకోట్ల ఆదాయాన్ని సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి, పావుసేరుకి తెగనమ్ముతున్నది మీరే కదా? ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ అయిన ఇండియన్‌ రైల్వేను ప్రైవేటుపరం చేస్తోంది మీరు కాదా?40 కోట్ల పాలసీదారులను కలిగిన  ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీని తెగనమ్మేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలు మీవి కావా? ఆరేళ్లకు 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు మోదీపై ఛార్జిషీట్‌ వేయాలి.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ సారి కూడా మేమే తొలి స్థానంలో ఉంటాం.. రెండో స్థానంలో మజ్లీస్‌ ఉంటుంది’’ అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

 కేటీఆర్‌ సంధించిన 50 ప్రశ్నలు ఇవే!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన