ఇదే చివరి హెచ్చరిక: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 12/04/2021 17:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదే చివరి హెచ్చరిక: కేటీఆర్‌

వరంగల్‌: సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారని.. ఆయన్ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ఇదే చివరి హెచ్చరికని తేల్చి చెప్పారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

వరంగల్‌ నగరాభివృద్ధికి ఎన్నికోట్లు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తామిచ్చిన డబ్బుకు రెట్టింపు కేంద్రం నుంచి తీసుకురాగలరా? అని భాజపాను ప్రశ్నించారు. ఉగాదికి ఒకరోజు ముందే నగరానికి తాగునీరు అందించామని మంత్రి చెప్పారు. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని.. వరంగల్‌కు మెట్రో నియో రైలు తీసుకొచ్చేది తామేనని కేటీఆర్‌ అన్నారు.  ‘‘మోదీ ఇచ్చిన కొలువులెన్ని? అమ్మిన సంస్థలెన్ని? నిరుద్యోగి సునీల్‌ను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించారు. దయచేసి యువతను గందరగోళానికి గురిచేయొద్దు. తెలంగాణ యువకులు క్షణికావేశానికి గురికావొద్దు. త్వరలోనే 50వేల ఉద్యోగాలకు ప్రకటన ఉంటుంది’’ అని పునరుద్ఘాటించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని