
తాజా వార్తలు
తెరాస శ్రేణులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. తెరాస శ్రేణులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెరాస హయాంలో నల్గొండ జిల్లాకు 3 వైద్య కళాశాలలు మంజూరు చేశామని.. వరంగల్‌కు ఐటీ, ఇతర రంగాల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఖమ్మంలో ఐటీ టవర్ నిర్మించుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి అభ్యర్థిత్వానికి ప్రత్యర్థుల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోందని చెప్పారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
ఇవీ చదవండి
Tags :