మీర్జాపురంలో లారీ బీభత్సం 
close

తాజా వార్తలు

Published : 25/02/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీర్జాపురంలో లారీ బీభత్సం 

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో లారీ బీభత్సం సృష్టించింది. దీంతో సుంకొల్లు గ్రామానికి చెందిన మాగంటి నారాయణ, ఆర్ల వెంకటేశ్వరరావు, మాగంటి శ్రీనివాసరావుకు చెందిన 45 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వీరు 200 గొర్రెలను గుడివాడ వైపు నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వైపునకు తోలుకు వెళుతుండగా హనుమాన్‌ జంక్షన్‌ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ గొర్రెల మీద నుంచి వెళ్లింది. ఈ ఘటనలో 45 జీవాలు మృత్యువాతపడ్డాయి. లారీ డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయాడని.. వాహనం తమ వైపు రావటం చూసి భయపడి పక్కకు వెళ్లిపోయామని బాధితులు చెప్పారు. గొర్రెలను కాపాడుకోలేకపోయామని.. వాటి విలువ రూ.5 లక్షలు ఉంటుందని వారు వాపోయారు. ఘటనపై నూజివీడు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌ కుమార్‌ వివరించారు.
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని