close

తాజా వార్తలు

Updated : 30/11/2020 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కొత్తగా 593 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 593 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,69,816కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,458కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1058 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,58,336కి చేరింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 119 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 55, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 7,946 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని