
తాజా వార్తలు
బిట్టు శ్రీను..ఆయుధాలెక్కడ.?
ఇంటర్నెట్ డెస్క్: హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బిట్టు శ్రీనుతో పాటు మరొకరని పోలీసులు ఇవాళ పార్వతీ బ్యారేజ్ వద్దకు తీసుకెళ్లారు. న్యాయవాదుల హత్యకు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు యత్నిస్తున్నారు. ఘటన అనంతరం ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో పోలీసులు విశాఖ నుంచి గజ ఈతగాళ్లను రప్పించి ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్వతీ బ్యారేజ్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.
హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతులను ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దంపతుల హత్య కేసుకు సంబంధించి బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.