పెట్రో మంట: గుర్రం కొనుక్కుంటా శిక్షణ ఇప్పించండి!
close

తాజా వార్తలు

Updated : 04/03/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రో మంట: గుర్రం కొనుక్కుంటా శిక్షణ ఇప్పించండి!

లఖ్‌నవూ: దేశంలో పెట్రోల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్‌ పెట్రోల్‌ రూ. వందకు చేరుకుంటోంది. దీంతో సామాన్య ప్రజలు వాహనం నడపాలంటే భయపడుతున్నారు. వాహనంలో పెట్రోల్‌ పోయించుకోలేక.. ప్రత్యామ్నాయాలవైపు దృష్టి పెడుతున్నారు. ప్రజారవాణాలో వెళ్లడం.. సైకిల్‌ లేదా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్‌ మంటలు భరించలేక గుర్రం కొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఆయనకు గుర్రపు స్వారీ తెలియదట. అందుకే గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పించాలని స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

వారణాసిలో నివసించే న్యాయవాది హరీశ్‌ చంద్ర మౌర్య.. తన ఇంటి నుంచి కోర్టుకు వెళ్లిరావాలంటే 20కి.మీ ప్రయాణించాల్సి ఉంటుందట. ప్రస్తుత పెట్రోల్‌ ధరలతో తన వాహనంపై కోర్టుకు వెళ్లాలంటే ఆర్థిక భారం పెరిగిపోతుందని వాపోయాడు. అందుకే ఓ గుర్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. హరీశ్‌ ఉండే ప్రాంతంలోనే ట్రాఫిక్‌ పోలీసుల ఆధర్వంలో గుర్రపు స్వారీలో శిక్షణ ఇచ్చే అకాడమీ నడుస్తోంది. దీంతో తను కొనుగోలు చేసిన గుర్రంపై స్వారీ చేయడానికి ఈ అకాడమీలో తగిన శిక్షణ ఇప్పించాలని కోరుతూ స్థానిక పోలీసు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. మరి పోలీసులు హరీశ్‌ చంద్ర దరఖాస్తుకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి! పెట్రోలు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హరీశ్‌ తీసుకున్న నిర్ణయం వ్యంగ్యంగా కనిపించినా.. వాస్తవ పరిస్థితులు అలాగే ఉన్నాయని నెటిజన్లు చమత్కారంగా కామెంట్లు పెడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని