close

తాజా వార్తలు

Published : 11/04/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా వేద్దాం’

కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో టీకా తీసుకోవడంపై ఉన్న వయసు పరిమితిని ఎత్తివేయాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ టీకా అందించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి గొలుసును తుంచేయాలంటే ప్రతిఒక్కరికీ టీకా ఇవ్వడం తప్పదని అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశామని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. ప్రతిఒక్కరూ టీకా వేయించుకునేలా దిల్లీలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. దిల్లీలో ఉన్న కరోనా బాధితుల్లో 65 శాతం మంది 45 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే అని తెలిపారు.

ఇప్పటికే దిల్లీలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని కోరారు. దిల్లీలో ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఏడాది కాలంగా కొవిడ్‌పై చేస్తున్న పోరులో ముందున్న వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ప్రశంసించారు.

మరోవైపు పెరిగిపోతున్న కొవిడ్‌-19 కేసులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా దిల్లీ ప్రభుత్వం శనివారం పలు కఠిన ఆంక్షలను విధించింది. స్థానిక మెట్రో రైళ్లు, బస్సులు.. సీట్ల సామర్థ్యంలో 50 శాతం ప్రయాణికులతో నడవనున్నట్లు ప్రకటించింది. వివాహాల్లో అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేసింది. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సంస్కృతిక సంబంధ సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రెస్టారెంట్లు, బార్లు సైతం 50 శాతం సామర్థ్యంతో పనిచేయాలని అధికారులు స్పష్టంచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే ఈత కొలనులు మినహా మిగిలినవన్నీ మూసే ఉంచాలన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని