
తాజా వార్తలు
గ్రేటర్ ఎన్నికలు.. భారీగా మద్యం అమ్మకాలు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. నవంబర్‌లో గడిచిన మూడు వారాల్లో రూ.1,708 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మొదటి రెండు వారాలు సగటున రూ.520కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మూడో వారంలో ఏకంగా రూ.662కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాల్లో వెల్లడైంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెల 17వ తేదీన రూ.104కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 18వ తేదీన రూ.84కోట్లు, 19న రూ.90కోట్లు, 20న రూ.85కోట్లు, 21వ తేదీన రూ.140కోట్ల విలువైన మద్యంఅమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. జీహెచ్ఎంసీలో నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి విక్రయాలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
