close

తాజా వార్తలు

Published : 19/01/2021 07:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

7 నెలలు... రూ.25 వేల కోట్లు

చైనా కంపెనీల రుణ యాప్‌ల దందా

సూత్రధారి జెన్నిఫర్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ

హైదరాబాద్‌: చైనా కంపెనీల రుణాల యాప్‌ల దందాలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ యాప్‌ల ద్వారా గత ఏడాది మార్చి నుంచి అక్టోబరు మధ్య ఏడు నెలల్లో రూ.25 వేల కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. కీలక నిందితులు ల్యాంబో, నాగరాజులను విచారించి, పది రోజుల్లోనే సంచలన అంశాలను సేకరించారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంటున్న చైనా దేశస్థురాలు జెన్నిఫర్‌ను రుణ యాప్‌ల సృష్టికర్తగా గుర్తించారు. ఆమె కోసం అన్ని విమానాశ్రయాలకు లుక్‌అవుట్‌ నోటీసులను జారీ చేశారు. పోలీసులు ఇప్పటివరకు రూ.350 కోట్ల నగదును స్తంభింపజేశారు.

కొత్త కంపెనీలు.. వ్యక్తులు.. యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న చైనా కంపెనీల లావాదేవీలను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రోజుకు రూ.100 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్నట్టు ల్యాంబో, నాగరాజుల ల్యాప్‌టాప్‌ల ద్వారా తెలుసుకున్నారు. రోజువారీ వసూళ్లు.. టర్నోవర్‌ను తొలుత ఇ-వ్యాలెట్లలోకి బదిలీ చేసుకుని అనంతరం 350 వర్చువల్‌ ఖాతాల్లోకి డిపాజిట్‌ చేస్తున్నారు. ఆ తర్వాత వేర్వేరు కంపెనీల ఖాతాలు, వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. తాజా పరిశోధనలో 175 కంపెనీలు, 50 మంది వ్యక్తిగత ఖాతాలకు ఈ నగదు మళ్లించినట్లు తేలింది. కాల్‌సెంటర్లను మూయించినా రుణ గ్రహీతలకు ఫోన్లు రావడం ఆగడం లేదు.

స్పందించిన గూగుల్‌.. చైనా కంపెనీలు సృష్టించిన రుణాల యాప్‌లు తొలగించాలంటూ తాము రాసిన లేఖపై గూగుల్‌ సంస్థ స్పందించిందని హైదరాబాద్‌ పోలీస్‌ సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) అవినాష్‌ మహంతి తెలిపారు. రుణాల యాప్‌ల నిర్వాహకుల వల్ల జరిగిన నేరాలు, ఘోరాలు, ఆత్మహత్యలకు సంబంధించిన అంశాలను లేఖలో పొందుపరిచాని, ఈ కంపెనీలు రిజర్వు బ్యాంక్‌ నుంచి అనుమతి పొందలేదని పేర్కొన్నామన్నారు. స్పందించిన గూగుల్‌.. తమ ప్లేస్టోర్‌ నుంచి మొత్తం 152 రుణ యాప్‌లను తక్షణం తొలగిస్తున్నామని సమాచారమిచ్చిందని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా తాము కోరిన ఇతర వివరాలను గూగుల్‌ ఇచ్చినట్లు వివరించారు.

ఇవీ చదవండి...
దుర్గగుడిలో... టిక్కెట్ల దొంగను పట్టేశారు..!

తల్లీకొడుకుల గురించి తెలిస్తే చెప్పండి



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని