బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 08:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం రెండు వేలకు పైగా, బెంగళూరులో సగటున వెయ్యి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. జులై 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు నగరం, బెంగళూరు గ్రామీణ  జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. అత్యవసర సేవలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 2,798 కేసులు నమోదయ్యాయి. 70 మంది మృతి చెందారు.  రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,216కు చేరగా, మృతుల సంఖ్య 613కు పెరిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని