హరియాణాలో వారం రోజుల Lockdown!
close

తాజా వార్తలు

Published : 02/05/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హరియాణాలో వారం రోజుల Lockdown!

ఛండీగఢ్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి మొదలుకొని వారం పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర హోం, ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు.  

కరోనా కేసుల అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ శుక్రవారమే హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అది రేపటితో ముగియనునన్న నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి లాక్‌డౌన్‌ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. 

హరియాణాలో  శనివారం అత్యధికంగా 13,588 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 125 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 102,516కు పెరిగింది. మొత్తం మరణాలు 4,341కి చేరాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆక్సిజన్‌, ఔషధాలు, కీలక వైద్యసరఫరాలను నిలిపి ఉంచడం లేదా బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో  పరిస్థితులు దేశ రాజధాని దిల్లీ కంటే అధ్వానంగా తయారయ్యాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని