UP Lockdown: యూపీలో లాక్‌డౌన్‌ పొడిగింపు!
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

UP Lockdown: యూపీలో లాక్‌డౌన్‌ పొడిగింపు!

లఖ్‌నవూ: కరోనా రెండో దశలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈనెల 17వ తేదీ వరకూ పొడిగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తాజా లాక్‌డౌన్‌తో మే 17వ తేదీ ఉదయం 7 గంటల వరకూ ఆ రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ కాలంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసే ఉంటాయని అధికారులు చెప్పారు. కొవిడ్‌ వ్యాప్తి గొలుసును తుంచే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గతంలో విధించిన లాక్‌డౌన్‌ రేపటితో ముగియనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసుల కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఇ-పాస్‌లు తప్పనిసరిగా పొందాలని పేర్కొంది. యూపీలో శనివారం 298 మంది మృత్యువాతపడ్డారు. మరో 26,847 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు దిల్లీలోనూ వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోవారం పాటు పొడిగిస్తూ సీఎం కేజ్రీవాల్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోనూ మే 17 వరకు కఠిన లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని