సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారా?: లోకేశ్‌
close

తాజా వార్తలు

Published : 22/04/2021 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారా?: లోకేశ్‌

 

అమరావతి: ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరై.. వారితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే సీఎం జగన్‌ బాధ్యత తీసుకుంటారా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆయన ఇవాళ ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని లోకేశ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

‘‘ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోంది. ఈ వైఖరితో విద్యార్థుల జీవితాలకే పరీక్ష పెడుతున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేస్తున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరై.. వ్యక్తిగతంగా పరీక్షలకు వెళ్లిన విద్యార్థులు కరోనా బారిన పడిన ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంలో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యం’’ అని లోకేశ్‌ అన్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని