కరోనా మరణాలు..ప్రభుత్వ హత్యలే: లోకేశ్‌
close

తాజా వార్తలు

Published : 03/05/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా మరణాలు..ప్రభుత్వ హత్యలే: లోకేశ్‌

అమరావతి: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే సీఎం జగన్‌ను నమ్ముకున్న దేవుడైనా క్షమించడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. హిందూపురం ఆస్పత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్‌ అందక చనిపోయిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని.. సీఎం ఇందుకు బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపునకు వాడే అధికార యంత్రాంగాన్ని ఇకనైనా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించాలని హితవు పలికారు. ఆక్సిజన్‌ సరఫరాపై దృష్టి పెట్టకుండా అధికారులు, పోలీసులు, వాలంటీర్లను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని విమర్శించారు.

కరోనా బాధితుల మృతి బాధాకరం: అచ్చెన్న

ప్రజారోగ్యంతో వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితుల మృతి బాధాకరమన్నారు. సకాలంలో ఆక్సిజన్‌ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణవాయువు కోసం బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. గతేడాది ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటిలేటర్లు ఇచ్చినా.. ఇంతవరకు అమర్చలేదని అచ్చెన్న తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని