close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 119063111 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => miX_M9oES-c [video_short_link] => miX_M9oES-c [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2019-12-25 09:41:11.113801 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

3 ముక్కలు చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం: లోకేశ్‌

అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా మంగళగిరిలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు, వివిధ ప్రజాసంఘాల నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ...‘‘ ఆ నాడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టనని జగన్‌ చెప్పారు. చంద్రబాబు అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే ..జగన్‌ కూడా మద్దతు తెలిపారు. అధికారంలోకి రాగానే జగన్‌ మాట తప్పి మడం తిప్పారు. ఇవాళ అమరావతికి జరిగే అన్యాయం రేపు అన్ని జిల్లాలకు జరుగుతుంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి..పబ్బం గడపాలనే జగన్‌ ఎత్తుగడ. రైతుల ఆందోళనలను పాలకులు ఎగతాళి చేస్తున్నారు. వైకాపా నేతలు రైతులగోడు వినేందుకు ఎందుకు రావట్లేదు?. 29 గ్రామాల ప్రజలు ఐక్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుంది. మూడు ముక్కలుగా రాష్ట్రాన్ని విడగొట్టి బిస్కెట్‌ విసిరినట్లు విసిరితే అభివృద్ధి ఎలా సాధ్యం. జీఎన్‌ రావు కమిటీ ఓ బోగస్‌ కమిటీ’’ అని లోకేశ్‌ విమర్శించారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.