కలలు కరిగి.. హృదయం పగిలి
close

తాజా వార్తలు

Published : 26/01/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలలు కరిగి.. హృదయం పగిలి

తొలుత ప్రియురాలు... తర్వాత ప్రియుడు

చరవాణిలో చాటింగ్‌ ఆపై ఆత్మహత్య

ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. ప్రేమకు మూడు ముళ్లు వేద్దాం. 

- చాటింగ్‌లో ప్రేయసి.!!

నేను ఇంకా స్థిరపడలేదు.. అప్పుడే పెళ్లొద్దు.. అర్థం చేసుకో...

- ప్రేయసి ప్రతిపాదనకు ప్రేమికుడి సమాధానం.!!

ఇలా చరవాణి చాటింగ్‌లో మాటామాటా పెరిగింది. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.

నందిపేట్‌: నందిపేట్‌ మండలం ఖుదావంద్‌పూర్‌కు చెందిన డీకంపల్లి సుకన్య(21), అయిలాపూర్‌కు చెందిన ప్రేమ్‌ కుమార్‌(22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తిచేశారు. ఇద్దరివి పక్కపక్క గ్రామాలే. నాలుగేళ్లుగా ప్రేమ కొనసాగుతోంది. అమ్మాయి ఇంట్లో పెళ్లి ప్రస్తావన రావడంతో ఆదివారం రాత్రి వీరిద్దరు చరవాణిలో చాటింగ్‌ చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆమె పేర్కొంది. కొన్నాళ్లు ఆగుదామని యువకుడు పేర్కొన్నాడు. మనస్తాపానికి గురైన సుకన్య సోమవారం ఉదయం తన గదిలో ఉరేసుకుంది. శబ్దం రావడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. అయిలాపూర్‌లో ఉన్న ప్రియుడు ప్రేమ్‌కుమార్‌కు విషయం తెలియడంతో గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.

రెండు కుటుంబాల్లో విషాదం

సుకన్య తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. ఆమె పెద్దక్క కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ్‌కుమార్‌ ఇంట్లో సోమవారం ఆయన అన్న భార్య సీమంతం పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఆ ఏర్పాట్లలో ఉండగా.. అంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు.

ఇవీ చదవండి..

నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?

బస్సు ప్రమాదంలో 12 మందికి గాయాలుTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని