గాజువాకలో ప్రేమజంట ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 18/12/2020 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాజువాకలో ప్రేమజంట ఆత్మహత్య

గాజువాక: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గాజువాక శ్రీనగర్‌ కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పరవాడ మండలం భోనంగి గ్రామానికి చెందిన యువతి, అవినాష్‌(33)  కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. రిజిస్టర్‌ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. 

ఈ క్రమంలో గురువారం గాజువాక శ్రీనగర్‌ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈ ఉదయం 9గంటల సమయంలో ఇంటి యజమాని వచ్చి తలుపుకొట్టినా ఎంతకూ తెరవకపోవడంతో కిటికీలోంచి చూడగా.. ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ విషయాన్ని వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని