ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 11/12/2020 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

మునగాల గ్రామీణం: చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా  మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌(21), ఓ యువతి గత  కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

 ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే, వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై గురువారం సాయంత్రం ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. మొద్దుల చెరువు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని