రైలు పట్టాలపై ప్రేమజంట బలవన్మరణం
close

తాజా వార్తలు

Published : 23/03/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైలు పట్టాలపై ప్రేమజంట బలవన్మరణం

టంగుటూరు: రైలు కిందపడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలుకు చెందిన విష్ణువర్ధన్‌(22), ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు(18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం  ఇద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని