లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య?
close

తాజా వార్తలు

Updated : 30/01/2021 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య?

వేదాయిపాలెం: నెల్లూరు జిల్లా పడారుపల్లిలో ఉన్న ఓ హోటల్‌లో శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను చిట్టమూరు మండలం మెట్టు సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్‌వో లావణ్య, డిజిటల్‌ అసిస్టెంట్ హరీశ్‌లుగా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణం ప్రేమ వ్యవహారమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరు ఆత్మహత్య చేసుకున్న గదిలో ‘‘దయచేసి మమ్మల్ని క్షమించండి. మా అవయవాలను దానం చేయండి’’ అని రాసి ఉన్న లెటర్‌ దొరికింది. దీంతో వీళ్ల ప్రేమ విఫలమైనందున ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోంది. వీరిద్దరికీ వేర్వేరుగా ఇటీవలే వివాహం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..
‘కాళికనని.. నాలుక కోసి తినేసింది’

అడ్డుగా ఉన్నాడని.. అంతమొందించారు..!Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని