మనస్పర్థలతో ప్రేమజంట ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 26/01/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనస్పర్థలతో ప్రేమజంట ఆత్మహత్య

నందిపేట: పెళ్లి విషయంలో మనస్పర్థలు రావడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుదావంద్‌పూర్‌ గ్రామానికి చెందిన సుకన్య(21), ఐలాపూర్‌ గ్రామానికి చెందిన ప్రేమ్‌(22) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం రాత్రి వీరిద్దరూ ఫోన్‌ ఛాటింగ్ చేసుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకునే విషయలో అభిప్రాయబేధాలొచ్చాయి. 

దీంతో మనస్తాపానికి గురైన యువతి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేయసి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసిన ప్రేమ్‌ తన స్వగ్రామంలోని చెరువు వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇరువురు మృతిచెండంపై ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..
ఇష్టపడిన యువతి మాట్లాడలేదని..

నల్గొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని