close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120021031 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/1890224837788194 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/1890224837788194 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-13 12:27:48.986854 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

నిను విడిచి నేనుండలేను..

ఇరు కుటుంబాల్లో విషాదం

వెంకటేష్‌ (పాత చిత్రం)

తాటిచెట్లపాలెం, గోపాలపట్నం: ఓ ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని తెలిసిన కొద్ది గంటల్లోనే ప్రియుడు కూడా ఈలోకం నుంచి వెళ్లిపోయాడు. నువ్వులేని ఈ లోకంలో నేనుండలేనంటూ తనువు చాలించాడు. ఈ సంఘటన ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపగా.. ప్రేమికుల దినోత్సవానికి ముందు జరిగిన ఈ సంఘటన నగరంలో సంచలనం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా యలమంచిలి నెహ్రూనగర్‌కు చెందిన ఈరిగిల వెంకటేష్‌(23), విశాఖ నగరంలోని గోపాలపట్నంకు చెందిన ఓ యువతి (19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు ఎప్పుడు ఫోన్‌ చేసుకున్నా పెళ్లి విషయం చర్చకు వచ్చేది. వీరి పెళ్లికి ఒకరి కుటుంబం సానుకూలంగా ఉన్నా.. మరొకరి కుటుంబం నుంచి సానుకూలత వస్తుందోరాదోనని అనుకునేవారు. మంగళవారం సాయంత్రం యువతి ప్రియుడికి ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. దీంతో ఆందోళన చెందిన వెంకటేష్‌ యలమంచిలి నుంచి వెంటనే విశాఖ నగరంలోని బాపూజీనగర్‌లో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చాడు. ప్రియురాలి సోదరికి ఫోన్‌ చేసి యువతి ఆత్మహత్య చేసుకుంటానన్న విషయం తెలిపి అప్రమత్తంగా ఉండమని సూచించాడు. అప్పటికే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి తెలిపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేష్‌ బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో బయటకు వెళ్లివస్తానని సోదరికి చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో సోదరుడు ఫోన్‌ చేయగా.. తను లేకుండా నేను ఉండలేనని.. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. భయపడిన కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతగ్గా.. స్థానిక మధుసూదననగర్‌లోని ఓ చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. అన్నయ్య గణేష్‌ కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసును కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మణికట్టు కోసుకోవడానికి ప్రయత్నించి....

వెంకటేష్‌ మొదట చేతి నరాలు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గుర్తించారు. చేతికి గాయాలు ఉన్నాయి. అది విఫలమవడంతో చెట్టుకు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.