mRNA Vaccine: భారత్‌కు మరో వ్యాక్సిన్‌!
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

mRNA Vaccine: భారత్‌కు మరో వ్యాక్సిన్‌!

తీసుకొచ్చే యోచనలో లుపిన్‌

ముంబయి: కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా భారత్‌కు ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌ వ్యాక్సిన్లను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు దేశీయ ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్‌ వెల్లడించింది. ఇందుకోసం ఇతర వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో కలిసి పని చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక కొవిడ్‌ చికిత్సకు అవసరమయ్యే రెమ్‌డెసివిర్‌ లాంటి ఔషధాలను కూడా దేశానికి తీసుకురావాలని అనుకుంటున్నట్లు పేర్కొంది.

‘‘mRNA వ్యాక్సిన్లను దేశానికి తీసుకురావాలని భావిస్తున్నాం. ప్రస్తుతం కనీసం ఆరు కంపెనీలకు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఏదో ఒకదానితో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నాం’’ అని లుపిన్‌ ఎండీ నీలేశ్‌ గుప్తా తెలిపారు. అయితే ఈ డీల్‌ ఎప్పుడు కుదురుతుంది అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.

ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో వ్యాక్సిన్లు తయారు చేసిన వాటిలో ఫైజర్‌, మోడెర్నా ముందున్నాయి. ఈ రెండింటిలో ఒకదానితో లుపిన్‌ ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దిగుమతుల ద్వారా ఈ వ్యాక్సిన్లను తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. బాక్రిసిటినిబ్‌ ఔషధాన్ని దేశంలోకి తెచ్చేందుకు లుపిన్‌ ఇప్పటికే ఎలీ లిల్లీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఔషధాన్ని రెమ్‌డెసివిర్‌తో పాటు కొవిడ్‌ రోగుల చికిత్సలో ఉపయోగిస్తారు. వచ్చే రెండు నెలల్లో బాక్రిసిటినిబ్‌ను లుపిన్‌ దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని