తహసీల్దార్‌ ఆఫీసుకు తాళం వేసిన మహిళ
close

తాజా వార్తలు

Published : 31/12/2020 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 తహసీల్దార్‌ ఆఫీసుకు తాళం వేసిన మహిళ


గుంటూరు : సమస్య పరిష్కారం కోసం అర్జీలు పెట్టుకున్నా అధికారులు స్పందించలేదంటూ తహసీల్దార్‌ కార్యాలయానికి మహిళా రైతు తాళం వేసిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన లక్ష్మీ మే 11న పొలం కొలతల కోసం తహసీల్దార్‌కు అర్జీ పెట్టుకుంది. ఆ విషయం గురించి ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదట. దీంతో విసిగిపోయిన ఆమె అధికారులు, సిబ్బందిని బయటకు రానివ్వకుండా కార్యాలయానికి తాళం వేసింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు తాళం తీసే ప్రసక్తే లేదని హెచ్చరించింది.

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని