మహారాష్ట్రలో తగ్గిన పాజిటివ్‌ కేసులు
close

తాజా వార్తలు

Published : 19/04/2021 21:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో తగ్గిన పాజిటివ్‌ కేసులు

ముంబయి: అత్యధిక పాజిటివ్‌ కేసులతో తీవ్రంగా సతమతమవుతోంది మహారాష్ట్ర. ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 68,631 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారం కరోనా కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కొత్తగా 58,924 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 351మంది మృత్యువాతపడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 38,98,262కు చేరగా, 60,824మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.76లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. సోమవారం 52,412మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ముంబయిలో కొత్తగా 7,381మంది కరోనా బారిన పడగా, నాగ్‌పూర్‌లో 5,086మంది, పుణెలో 4,616మందికి పాజిటివ్‌ నిర్థారణ అయింది.58,924మందిలో 15,623మంది ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. ప్రస్తుతం మహారాష్ట్రలో రికవరీ రేటు 81.04గా ఉంది. ఇక 37,43,968మంది హోం క్వారంటైన్‌లో ఉండగా, 27,081మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని