close

తాజా వార్తలు

Published : 10/08/2020 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాతో మహబూబాబాద్ ఏ.ఆర్‌‌ డీఎస్పీ మృతి

మహబూబాబాద్‌: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ముందుండి పనిచేస్తున్న పోలీసులు కొవిడ్‌ బారిన పడుతుననారు. తాజాగా ఈ వైరస్‌ బారిన పడి మహబూబాబాద్ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) డీఎస్పీ శశిధర్ (50) మృతిచెందారు. హైదరాబాద్‌ నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ప్రాణాలు కోల్పోయారు. 1996వ బ్యాచ్‌ ఆర్‌ఎస్సైగా బెల్లంపల్లి హెడ్‌ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆర్‌ఐగా కరీంనగర్, సిరిసిల్లలో విధులు నిర్వహించి పదోన్నతి పొంది 2010 ఫిబ్రవరి నెలలో మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో డీఎస్పీ శశిధర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. డీఎస్పీ మృతి పట్ల మంత్రి సత్యవతి రాఠోడ్‌, జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డితోపాటు జిల్లా పోలీసు అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.