రైస్‌ మిల్లుకు రూ.80 కోట్ల విద్యుత్‌ బిల్లు! 

తాజా వార్తలు

Published : 25/02/2021 09:12 IST

రైస్‌ మిల్లుకు రూ.80 కోట్ల విద్యుత్‌ బిల్లు! 

పాల్ఘర్‌: మహారాష్ట్రలో ఓ రైస్‌ మిల్లు యజమాని విద్యుత్తు బిల్లు ఇచ్చిన షాక్‌కు నిర్ఘాంతపోయాడు. ఇంతకీ వచ్చిన బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా ఎనభై కోట్ల రూపాయలు!! పాల్ఘర్‌కు చెందిన 66 ఏళ్ల గణపత్‌ నాయక్‌కు ఓ రైస్‌ మిల్లు ఉంది. ప్రతినెలా దానికి రూ.50 వేలకు కాస్త అటూఇటూ బిల్లు వచ్చేది. గత సోమవారం మాత్రం ఏకంగా రూ.80,13,89,600 బిల్లు ఆయన చేతికొచ్చింది. దిగ్భ్రాంతి చెందిన ఆయన అధికారులను ఆశ్రయించారు. మరుసటి రోజు మిల్లుకు వెళ్లి పరిశీలించిన అధికారులు.. రీడింగ్‌ తప్పు పడినట్లు గుర్తించారు. ఆపై బిల్లును రూ.80 వేలుగా సరిచేయడంతో గణపత్‌ నాయక్‌ ఊపిరి పీల్చుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని