close

తాజా వార్తలు

Published : 07/05/2020 18:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మహేశ్‌ 27’ సర్‌ప్రైజ్‌ ఆరోజేనా?

హైదరాబాద్‌: ‘సరిలేరు నీకెవ్వరు’తో ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబంతో గడుపుతున్నారు. ఆయన నటించబోయే తర్వాతి చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ‘మహేశ్‌ 27’ చిత్రాన్ని పరశురామ్‌ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత చిత్రీకరణ ప్రారంభం కానుంది.

తాజాగా ఈసినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలు లేదా మహేశ్‌లుక్‌ను మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందట. ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం, అందులో మహేశ్‌బాబు నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి కథానాయికగా ఎవరు నటిస్తారు? మహేశ్‌ లుక్‌ ఎలా ఉంటుంది? వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని