మహేశ్‌, సితారకు పోటీ.. ఎవరు గెలిచారు?
close

తాజా వార్తలు

Published : 23/06/2020 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌, సితారకు పోటీ.. ఎవరు గెలిచారు?

వీడియో షేర్‌ చేసిన సూపర్‌స్టార్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు లాక్‌డౌన్‌ కారణంగా తన కెరీర్‌లోనే అతి పెద్ద బ్రేక్‌ తీసుకున్నారు. సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ఇంట్లో తన కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. పిల్లలు గౌతమ్‌, సితారలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో తీసిన ఫన్నీ వీడియోలను ఇప్పటికే పలు సందర్భాల్లో నమ్రత సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. తాజాగా మహేశ్‌కు, సితారకు మధ్య ‘టంగ్‌ ట్విస్టర్‌’గేమ్ (తడబడకుండా కష్టమైన డైలాగ్‌ చెప్పడం) జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ‘ఇది టంగ్‌ ట్విస్టర్‌ సమయం.. తను సరిగ్గా చెప్పి, గెలిచానంటూ నన్ను ఒప్పించేసింది. కుటుంబ సభ్యుల బంధాలు.. ఫ్యామిటీ టైమ్‌’ అంటూ లవ్ సింబల్స్‌ను షేర్‌ చేశారు. తండ్రీకూతుళ్ల మధ్య అనురాగాన్ని తెలుపుతున్న ఈ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను కేవలం గంట వ్యవధిలో 4.7 లక్షల మంది వీక్షించడం విశేషం.

సూపర్‌స్టార్‌ సాయం..

మహేశ్‌ చొరవతో ఓ పసికందు ప్రాణాలు నిలిచాయి. గుండెజబ్బుతో బాధపడుతున్న నెల రోజుల చిన్నారికి శస్త్ర చికిత్స నిర్వహించేందుకు ఆయన సాయం చేశారు.  ఇటువంటి క్లిష్ట సమయంలోనూ ఆంధ్రా హాస్పిటల్స్‌ వైద్యులు విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు. చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కూడా చేసినట్లు నమ్రత తెలిపారు. వైద్యులను ప్రశంసిస్తూ పోస్ట్‌ చేశారు. ఇదే సందర్భంగా మహేశ్‌ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


 
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని