close

తాజా వార్తలు

Published : 15/03/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆసక్తి పెంచుతోన్న ‘మేజర్‌’ గ్లింప్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్: 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మేజర్‌’. యువ కథానాయకుడు అడివి శేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్కా దర్శకుడు. మార్చి 15 సందీప్‌ జయంతి సందర్భంగా చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేశారు దర్శక-నిర్మాతలు. మంటల మధ్యలో అడవి శేష్‌ నిలబడి ఉన్న సీన్‌ను చిత్ర బృందం పంచుకుంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది.

మార్చి 28న టీజర్‌ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. శోభిత ధూళిపాళ, బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ నాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ ప్లస్‌ ఎస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జులై 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్