close

తాజా వార్తలు

Updated : 05/03/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నందిగ్రామ్‌ నుంచి దీదీ: 291మందితో జాబితా 

ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించిన మమత

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 291మంది అభ్యర్థుల జాబితాను సీఎం మమతా బెనర్జీ గురువారం విడుదల చేశారు. ఈసారి నందిగ్రామ్‌ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు దీదీ స్పష్టంచేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌ నుంచి సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ్‌ను బరిలో దించుతున్నట్టు దీదీ స్పష్టంచేశారు. బెంగాల్‌ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లు ఉండగా.. 291 స్థానాలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థులను ఖరారు చేసి ఒకేసారి మమత భారీ జాబితాను ప్రకటించారు. మిగతా మూడు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. రెండు స్థానాల నుంచి దీదీ పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఈసారి నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగాలని ఆమె నిర్ణయించుకోవడం విశేషం. ఇటీవల తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి భాజపాలో చేరిన సువేందు అధికారి ఇక్కడి నుంచి పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

50 మంది మహిళలకు సీట్లు!

ఈసారి 80 ఏళ్లు పైబడిన అభ్యర్థులకు టిక్కెట్లు నిరాకరించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించిన జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలు అభ్యర్థులు ఉన్నారు. బెంగాల్‌లో ఈసారి భాజపా నుంచి గట్టిపోటీ ఎదురవ్వడంతో మమత ఇప్పటికే అప్రమత్తమయ్యారు. దీనికి తోడు పలువురు కీలక నేతలు పార్టీని వీడి భాజపాలో చేరడంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించి కసరత్తు చేసినట్టు సమాచారం. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్‌ 29న ఎనిమిదో దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

10న నామినేషన్‌ వేస్తా..!

ఈ నెల 9న నందిగ్రామ్‌ వెళ్తానని మమతా బెనర్జీ వెల్లడించారు. 10న హల్దియాలో నామినేషన్‌ వేయనున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే తేజస్వీయాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే దీదీకి మద్దతు తెలిపారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని