close

తాజా వార్తలు

Published : 12/04/2021 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మోదీ జపం చేస్తున్న దీదీ’!

మళ్లీ అధికారంలోకి రాలేరన్న ప్రధాని మోదీ

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నినాదమైన ‘మా, మాతి, మనుష్’ను మరిచిపోయిన మమతా బెనర్జీ.. ‘మోదీ’ జపం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో అధికారం కోల్పోయిన వామపక్షాలు మళ్లీ తిరిగి అధికారంలోకి రాలేరనే విషయం దీదీకి తెలుసని.. అదే పరిస్థితి ఆమెకు కూడా ఎదురవుతుందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్దమాన్ నియోజకవర్గంలో పర్యటించిన మోదీ.. ఓటమి భయంతోనే మమతా బెనర్జీలో అసహనం పెరిగిందన్నారు.

‘మా, మాతి, మనుష్‌ నినాదంతో కొన్నేళ్లుగా బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలో కొనసాగుతున్నారు. కానీ, కొంతకాలంగా ఆమె ప్రచారంలో ‘మోదీ, మోదీ, మోదీ’ అనే నినాదమే వినిపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది మమతా బెనర్జీకి కోపం, అసహనం పెరిగిపోతోంది. దీదీ తన పాలనలో రాష్ట్రంలో కేవలం గందరగోళ వాతావరణాన్ని మాత్రమే సృష్టించగలిగింది’ అని ప్రధాని విమర్శించారు. నందిగ్రామ్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌ స్థానాల్లో ఓటమి చెందుతారని తెలియడంతోనే మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.

ఇక కేంద్ర బలగాలపై మమతా బెనర్జీ చేస్తోన్న ఆరోపణలపైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. కేంద్ర బలగాలపై దీదీకి గౌరవం లేదని.. ప్రజలను రెచ్చగొట్టడం వల్లే చాలా చోట్ల హింస చోటుచేసుకుందని ఆరోపించారు. అంతేకాకుండా ఓ వర్గాన్ని కించపరుస్తూ దీదీ చేసిన వ్యాఖ్యలనూ ప్రధాని మోదీ తప్పుబట్టారు. మీకేమైనా కోపం ఉంటే నాపైనా చూపించండి..కానీ, బెంగాల్‌ గౌరవాన్ని పోగొట్టవద్దని మమతా బెనర్జీకి ప్రధాని మోదీ సూచించారు.

ఇదిలాఉంటే పశ్చిమబెంగాల్‌లో ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మరో నాలుగు దశల్లో పోలింగ్‌ జరుగనుంది. మే 2వ తేదీని ఓట్ల లెక్కింపు జరుగనుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని