దీదీకి గాయం.. మడమ ఎముకలో పగుళ్లు
close

తాజా వార్తలు

Updated : 11/03/2021 11:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీదీకి గాయం.. మడమ ఎముకలో పగుళ్లు

48 గంటలపాటు పర్యవేక్షణ అవసరమన్న వైద్యులు

కోల్‌కతా: కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు గురువారం ఉదయం నివేదిక విడుదల చేశారు. ఆమె ఎడమ కాలు చీలమండ, పాదంలో తీవ్రమైన ఎముక గాయాలను గుర్తించినట్లు వెల్లడించారు. దీదీ కుడి భుజం, మెడకు కూడా గాయమైనట్లు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నుంచి సీఎం.. ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతున్నారని, ఆమెను 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. మరిన్ని వైద్యపరీక్షలు చేయాల్సి ఉందన్నారు. 

నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న దీదీని బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తోసేసిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన అనంతరం రేయపారా ప్రాంతంలో ఓ ఆలయాన్ని సందర్శించి తిరిగి కారు ఎక్కుతుండగా.. కొంతమంది తనను బలవంతంగా తోసి, కారు తలుపు వేసినట్లు మమత పేర్కొన్నారు. నొప్పితో విలవిల్లాడుతున్న సీఎంను వెంటనే కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా.. కాలి మడమలో పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు. 

తృణమూల్‌.. భాజపా మాటల యుద్ధం

మరోవైపు సీఎం కాలికి గాయం నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. దీదీపై కుట్రపూరితంగానే భాజపా దాడి చేసిందని తృణమూల్‌ ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలను కాషాయ పార్టీ ఖండించింది. మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అదంతా నాటకమని దుయ్యబట్టింది. చిన్న ప్రమాదాన్ని దీదీ పెద్దది చేసి చూపుతున్నారని ఎద్దేవా చేసింది. అయితే భాజపా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ.. భాజపాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ‘‘బెంగాల్‌ ప్రజల పవర్‌ ఏంటో మే 2వ తేదీన తెలుస్తుంది. దాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ భాజపాకు సవాల్‌ విసిరారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని