వైరల్‌: ఉమ్ముతూ రోటీలు.. వ్యక్తి అరెస్ట్‌!
close

తాజా వార్తలు

Published : 22/02/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరల్‌: ఉమ్ముతూ రోటీలు.. వ్యక్తి అరెస్ట్‌!

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వంటగాడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. నలుగురు తినాల్సిన రోటీలపై ఉమ్మివేసి తయారుచేశాడు. ఇది కాస్త అక్కడున్న ఓ వ్యక్తి రహస్యంగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సొహైల్‌గా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై హిందూ జాగరణ్‌ మంచ్‌ సభ్యులు మేరఠ్‌లోని ఎల్‌ఎల్‌ఆర్‌ఎం పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. విందు వేడుకల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు సచిన్‌ సిరోహి డిమాండ్‌ చేశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని