
తాజా వార్తలు
పక్కింట్లో సిలిండర్ పేలుడు.. కంగారులో..
అమీర్‌పేట, గోషామహల్, న్యూస్‌టుడే: రహమత్‌నగర్‌లో ఉంటున్న రెడ్‌హిల్స్ డివిజన్ జలమండలి జీఎం ఆర్.శ్రీనివాసరావు(51) బుధవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇంటి పక్కన గ్యాస్ సిలిండర్ పేలడంతో అప్రమత్తమై విద్యుత్ స్విచ్‌లను ఆపేందుకు కిందకు వచ్చారు. మరోసారి పేలుడు చప్పుడు రావడంతో గుండెపోటుతో కుప్పకూలినట్లు సహోద్యోగులు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ శేషుకుమారి, జలమండలి జీఎం ప్రభు తదితరులు పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Tags :
జిల్లా వార్తలు