38మంది భార్యల ‘బిగ్‌ ఫ్యామిలీమ్యాన్‌’ ఇకలేరు!

తాజా వార్తలు

Published : 14/06/2021 01:30 IST

38మంది భార్యల ‘బిగ్‌ ఫ్యామిలీమ్యాన్‌’ ఇకలేరు!

ఐజ్వాల్‌: జియోనా చానా.. మిజోరం రాష్ట్రానికి చెందిన 76 ఏళ్ల వ్యక్తి కన్నుమూశారు. అది సాధారణమే కదా అనుకోవద్దు. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాళ్లు. కోడళ్లతో కలిపితే  160కి పైమాటే.. వీళ్లంతా ఒకే ఇంట్లో ఉంటారు.  ప్రపంచంలో ఇదే అతిపెద్ద కుటుంబమేమో. ఇవాళ మధ్యాహ్నం ఐజ్వాల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

జియోనా మరణం పట్ల మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు. ‘‘ భారమైన హృదయంతో జియోనాకు మిజోరం ప్రజలు వీడ్కోలు పలుకుతున్నారు. ప్రపంచంలో ఆయనదే అతిపెద్ద కుటుంబమని నమ్ముతున్నాం. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు. ఆ కుటుంబం వల్లే  మిజోరం, ఆయన గ్రామం భక్తవంగ్‌ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందాయి.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు.

జియోనా.. చానా సామాజిక వర్గానికి చెందిన వారు. 1945, జులై 21న జన్మించారు. 17 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఆయన కంటే మూడేళ్లు పెద్ద. మొత్తం కుటుంబ సభ్యులంతా ‘చుహాన్‌ తార్‌ రన్‌’ అనే నాలుగు అంతస్తుల భవనంలో నివాసం ఉంటారు. అందులో దాదాపు 100 గదులుంటాయి. ఆయన కొడుకులు, కోడళ్లు, పిల్లలు వేర్వేరు గదుల్లో ఉంటారు.కానీ, వారందరికీ వంటగది ఒక్కటే. అందరూ కలిసే భోజనాలు చేస్తారు. ఆయన పడక గదికి ఆనుకొని ఉన్న డార్మెటరీలో భార్యలంతా ఉంటారు. ప్రస్తుతం వారి సొంత వనరులతోనే జీవితం నెట్టుకొస్తుంటారు. కొన్ని సార్లు పర్యాటకులు కొంత ఆర్థిక సాయం చేస్తుంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని