జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భార్యను చంపేశాడు!
close

తాజా వార్తలు

Updated : 05/02/2021 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భార్యను చంపేశాడు!

ఖమ్మం జిల్లాలో ఘటన
సినీఫక్కీలో కేసును చేధించిన పోలీసులు

పెనుబల్లి: పెళ్లయిన రెండు నెలలకే భార్యను హత్య చేసిన ఓ భర్త.. సినిమా రేంజ్‌లో స్క్రీన్‌ ప్లే నడిపించాడు. అనంతరం పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడేనికి చెందిన ఎర్రమాల నవ్యా రెడ్డి(20)కి తన సొంత బావ నాగశేషురెడ్డితో గతేడాది డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే బీటెక్‌ చదువుతున్న తన భార్య కనిపించడం లేదంటూ నాగశేషురెడ్డి ఈనెల 3న ఎర్రుపాలెం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అంతకుముందు రోజు సత్తుపల్లి సమీపంలోని కళాశాలకు నవ్యా రెడ్డి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దర్యాప్తులో భాగంగా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా మృతురాలు ఈనెల 2న భార్త నాగశేషురెడ్డితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. నాగశేషును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చివరకు భార్యను తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు. ఈనెల 2న తన భార్యకు పండ్లరసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి కుక్కలగుట్ట శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక చున్నీతో చెట్టుకు ఉరివేసినట్లు వెల్లడించాడు. అనంతరం నవ్యారెడ్డి మొబైల్‌ నుంచి ఆమె తండ్రికి ఇంజినీరింగ్‌ బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్‌ పంపినట్లు తెలిపాడు. ఈ మేరకు అదనపు ఎస్పీ మురళీధర్‌, వైరా ఏసీపీ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలం నుంచి నవ్యా రెడ్డి మృతదేహాన్ని పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. వేరే యువతితో నాగశేషుకు ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు నవ్య బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి..

ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు

పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని చంపేశాడు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని