చేతబడి నెపంతో తమ్ముడి కుమారులే చంపేశారు
close

తాజా వార్తలు

Updated : 12/03/2021 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతబడి నెపంతో తమ్ముడి కుమారులే చంపేశారు

ఎటపాక: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గోగుబాకలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి నెపంతో తమ్ముడి కుమారులే ఓ వ్యక్తిని చంపేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 5న అయ్యవారిపేటలో రత్తయ్య అదృశ్యమైనట్లు ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రత్తయ్య సోదరుడి కుమారులు ప్రసాద్‌, సత్యనారాయణలను నిందితులుగా తేల్చారు. రత్తయ్యను చంపి గోదావరి తీరంలో ఇసుకలోనే పూడ్చిపెట్టినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. వారు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. ఎటపాక సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కేసును ఛేదించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని