Oxygen కావాలంటూ వ్యక్తి ట్వీట్‌.. అరెస్టు
close

తాజా వార్తలు

Published : 29/04/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen కావాలంటూ వ్యక్తి ట్వీట్‌.. అరెస్టు

అమేఠీ: తన తాతయ్య ఆరోగ్యం విషమంగా ఉందని, అత్యవసరంగా ఆక్సిజన్‌ కావాలంటూ అత్యవసర సందేశం (ఎస్‌ఓఎస్‌) పంపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆక్సిజన్‌ కావాలని అభ్యర్థిస్తే అరెస్టు చేయడం ఏంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శశాంక్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన తాతయ్య ఆరోగ్యం విషమంగా ఉందని, ఆక్సిజన్‌ అవసరమని సోనూసూద్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌ ద్వారా అత్యవసర సందేశం పంపాడు. ఆ ట్వీట్‌ చూసిన శశాంక్‌ మిత్రుడు అంకిత్‌ ఆ మెసేజ్‌ను ఓ మహిళా జర్నలిస్ట్‌కు షేర్‌ చేశాడు. స్పందించిన జర్నలిస్టు శశాంక్‌ యాదవ్‌ తాతయ్యకి సాయమందించాలని ఓ ట్వీట్‌ చేస్తూ కేంద్ర మంత్రి, అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీని ట్యాగ్‌ చేశారు.

ఆ ట్వీట్‌కు స్మృతి ఇరానీ వెంటనే స్పందించారు. శశాంక్‌ను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించానని కానీ, అతడు స్పందించలేదని పేర్కొన్నారు. శశాంక్‌ గురించి ఆరా తీసి అతడి తాతయ్యకు సాయమందించాలని జిల్లా మెజిస్ట్రేట్‌తో పాటు అమేఠీ పోలీసులకు సూచించినట్లు మంత్రి తెలిపారు. కాగా అప్పటికే ఆ వృద్ధుడు మృతిచెందినట్లు తెలుసుకొన్న స్మృతి ఇరానీ అతడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శశాంక్‌ వెంటనే స్పందించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయాన్ని అమేఠీ జిల్లా మెజిస్ట్రేట్‌ లోతుగా పరిశీలించగా ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఆ ట్వీట్‌ సహా, వైద్యాధికారి నివేదిక పరిశీలించానని.. శశాంక్‌ యాదవ్‌ తాత కరోనాతో మృతిచెందలేదని వెల్లడించారు. అనారోగ్య సమస్యలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందినట్లు స్పష్టం చేశారు. ఆయనకు ఆక్సిజన్‌ అవసరం రాలేదని పేర్కొన్నారు. ఆక్సిజన్‌ అవసరం లేకపోయినా.. అవసరమంటూ ట్వీట్‌ చేసిన శశాంక్‌ యాదవ్‌పై చర్యలు తీసుకుంటునట్లు అమేఠీ పోలీసు సూపరింటెండెంట్‌ దినేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ‘ఈ విపత్కర సమయంలో ఈ తరహా మెసేజ్‌లను ఖండించడమే కాదు.. వారిని శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది’ అని దినేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆక్సిజన్‌ కొరత ఉందని సూచించేలా పోస్టు చేసినందుకు శశాంక్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని