close

తాజా వార్తలు

Updated : 15/04/2021 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తొలి డోసు కొవాగ్జిన్‌.. రెండో డోసు కొవిషీల్డ్‌

యూపీలో వైద్య సిబ్బంది నిర్వాకం

మహరాజ్‌గంజ్‌: కరోనా మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన వైద్య సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మహిళలు కరోనా టీకా కోసం వెళ్తే యాంటీ రేబిస్‌ టీకాలు ఇవ్వడం కలకలం రేపింది. తాజాగా ఇదే రాష్ట్రంలో కొవాగ్జిన్‌ టీకా తొలి డోసు తీసుకున్న ఓ వ్యక్తికి, రెండో డోసుగా కొవిషీల్డ్‌ ఇచ్చారు. మహరాజ్‌గంజ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

మహరాజ్‌గంజ్‌ జిల్లా చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారికి డ్రైవర్లుగా పనిచేస్తున్న ఉమేశ్‌, చందన్‌, మదన్‌ మార్చిలో కొవాగ్జిన్‌ తొలి డోసు తీసుకున్నారు. తాజాగా రెండో డోసు కోసం జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అయితే తొలుత ఉమేశ్‌కు మొదటి డోసు ఇచ్చిన వైద్య సిబ్బంది.. కొవాగ్జిన్‌కు బదులు కొవిషీల్డ్‌ టీకా వేశారు. పొరబాటును గ్రహించి మిగతా ఇద్దరికి రెండో డోసు ఇవ్వలేదు. 

ఇది వివాదాస్పదంగా మారడంతో ముఖ్య వైద్యాధికారి ఏకే శ్రీవాస్తవ స్పందించారు. ఈ ఘటన జరగకుండా ఉండాల్సిందన్న ఆయన.. టీకా తీసుకున్న ఉమేశ్‌లో ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని తెలిపారు. తొలి డోసులో ఇచ్చిన టీకానే రెండోసారి కూడా ఇవ్వాలని వైద్య సిబ్బందిని  ఆదేశించారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని