తల్లిని కడసారి చూసేందుకు.. ఓ యువకుడి సాహసం
close

తాజా వార్తలు

Published : 26/04/2021 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తల్లిని కడసారి చూసేందుకు.. ఓ యువకుడి సాహసం

కలబురిగి: కరోనా రక్కసి కుటుంబాలకు కుటుంబాలను బలితీసుకుంటోంది. ఎందరికో శోకం మిగులుస్తోంది. కరోనాతో మరణించిన తల్లిని కడసారి చూసేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఉద్వేగానికి గురిచేస్తోంది. కర్ణాటకలోని కలబురిగి జిల్లాకు చెందిన యువకుడు కొవిడ్ బారిన పడిన తన తల్లిని కరోనా ఆసుపత్రిలో చేర్చించాడు. వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ తల్లి ఆదివారం మృతి చెందింది. మృతురాలిని చివరి సారిగా చూసేందుకు వచ్చిన  కొడుకును ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. తన తల్లిని ఎలాగైనా చూడాలని సంకల్పించిన ఆ యువకుడు ఏకంగా ఆసుపత్రి భవనం ఎక్కాడు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని