మిథాలీ సేనపై స్మృతి జట్టుదే విజయం
close

తాజా వార్తలు

Published : 06/11/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మిథాలీ సేనపై స్మృతి జట్టుదే విజయం

48 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ట్రయల్‌ బ్లేజర్స్‌

షార్జా: మహిళల టీ20 ఛాలెంజ్‌ 2020లో భాగంగా జరిగిన రెండో మ్యాచులో స్మృతి మంధానా నేతృత్వంలో ట్రయల్స్‌ బ్లేజర్‌ దుమ్మురేపింది. మిథాలీరాజ్‌ సారథ్యంలోని వెలాసిటీని చిత్తు చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 48 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7.5 ఓవర్లలో 1 వికెట్‌ నష్టపోయి ఛేదించింది. డియాండ్రా డాటిన్‌ (29*; 28 బంతుల్లో 3×4), రిచా  ఘోష్‌ (13*; 10 బంతుల్లో 1×4, 1×6) అజేయంగా నిలిచారు. తిరుగులేని రన్‌రేట్‌తో విజయం అందించారు. కెప్టెన్‌ స్మృతి మంధాన (6; 9 బంతుల్లో) విఫలమైంది. అంతకుముందు వెలాసిటీలో షెఫాలీ వర్మ (13), శిఖపాంఏ (10), కాస్పరెక్‌ (11*) టాప్‌స్కోరర్లు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ను బుధవారం చిత్తుచేసిన వెలాసిటీ.. ట్రయల్‌ బ్లేజర్స్‌పై అలా ఆడలేదు. ఛేదనకు అనుకూలించే పిచ్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని పొరపాటు చేసింది. ప్రపంచ నంబర్‌వన్‌ బౌలరైన సోఫీ ఎకిల్‌స్టోన్‌ (4/9), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/13), జులన్‌ గోస్వామి (2/13) సమష్టిగా వెలాసిటీని దెబ్బకొట్టారు. ఒక సిక్సర్‌, బౌండరీ బాది జోరుమీదున్న ఓపెనర్‌ షెపాలీ వర్మ (13)ను 2.2వ బంతికే జులన్‌ బౌల్డ్‌ చేసింది. ఆ తర్వాత ఎకిల్‌స్టోన్‌ మాయ చేసింది. జట్టు స్కోరు 19 వద్ద వరుసగా మిథాలీ రాజ్‌ (1), వేద కృష్ణమూర్తి (0)ను పెవిలియన్‌ పంపించి కోలుకోలేని దెబ్బతీసింది.

మరికాసేపటికే డేనియెల్‌ వ్యాట్‌ (3)ను జులన్‌ ఔట్‌ చేయడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. నిన్నటి మ్యాచులో విజయం అందించిన సుష్మ వర్మ (1), సున్‌ లూస్‌ (4) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. సుష్మను ఎకిల్‌స్టోన్‌, లూస్‌ను రాజేశ్వరీ ఔట్‌చేశారు. శిఖా పాండే (10) పోరాడే క్రమంలో అనవసరంగా రనౌట్‌ అయింది. కాస్పెరెక్‌ (11) అజేయంగా నిలిచింది. అయితే సుశ్రీ దివ్యదర్శిని (0)ని గైక్వాడ్‌, ఎక్తాబిష్ఠ్‌ (0)ను దీప్తి, జహనారా ఆలమ్‌ (1)ను ఎకిల్‌స్టోన్‌ ఔట్‌ చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని