close

తాజా వార్తలు

Published : 08/01/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాగర్‌ ఎన్నిక తర్వాతే పీసీసీ అధ్యక్ష నియామకం

రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాకూర్‌

హైదరాబాద్: నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో కీలకమని.. ఎన్నిక తర్వాతే పీసీసీ అధ్యక్ష నియామకం ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాకూర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీతోనే కాంగ్రెస్‌ పార్టీ సాగర్‌ ఎన్నికల బరిలోకి దిగుతుందన్నారు. గాంధీభవన్‌లో మాణికం ఠాకూర్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కొనసాగుతారని స్పష్టం చేశారు.

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక విషయంలో చాలా మంది కాంగ్రెస్‌ నేతలతో చర్చించామని.. పోటీ చేసేందుకు పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలకు కొన్నివారాలే ఉన్నందున కొత్త నాయకత్వం కుదురుకోవడానికి సమయం పడుతుందని, ఇప్పుడున్న నాయకత్వంతోనే పోటీ చేయాలని జానారెడ్డి కోరినట్లు చెప్పారు. రాష్ట్ర నాయకులతో నిర్వహించిన సమావేశంలో అందరూ జానారెడ్డి విన్నపాన్ని పరిగణించాలని కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న విజ్ఞప్తికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సాగర్‌ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి కమిటీతో 2023 ఎన్నికలకు వెళ్తామని మాణికం ఠాకూర్‌ వివరించారు.

ఇవీ చదవండి..

కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారు: భట్టి

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తాచాటుతాం: భాజపా



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని