close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 16/07/2020 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మణిరత్నం కొత్త ఆలోచన.. ‘తొమ్మిది’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్రెండ్‌కి తగ్గట్టుగా తన స్టైల్‌ను మార్చుకుంటూ కొత్త ట్రెండ్‌ సృష్టించే దర్శకుడు మణిరత్నం. కథ, నేపథ్యం, నటీనటుల ఎంపిక... ఇలా అన్నింటా తన మార్కు చూపిస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన అలాంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాల్లో తనదైన దర్శకత్వ శైలితో అందరి మనసులు గెలుచుకున్న మణిరత్నం చూపు ఇప్పుడు ఓటీటీపై పడిందని తెలుస్తోంది. అది కూడా మామూలుగా తీస్తే అందులో మణి మార్కు ఏముంటుంది... అందుకే వైవిధ్యం, భారీతనం రెండూ ఉండేలా ఓ వెబ్‌సిరీస్‌ ప్లాన్‌ చేస్తున్నారట. 

ఓటీటీల్లో వచ్చే వెబ్‌ సిరీస్‌ల గురించి మీకు తెలిసే ఉంటుంది. సినిమా స్టైల్‌లోనే ఒక కథ రాసుకొని.. సీన్స్‌ సిద్ధం చేసుకొని సీరియల్స్‌ స్టైల్‌లో ఎపిసోడ్లుగా చిత్రీకరిస్తుంటారు. అలాగే మణిరత్నం వెబ్‌సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయి. తొమ్మిందిటికీ తొమ్మిది మంది హీరోలు, దర్శకుల ఉంటారట. ఆ తొమ్మిదిలో ఓ ఎపిసోడ్‌కు ఆయనే దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి దర్శకులు, ప్రధాన పాత్రధారుల విషయంలో ఓ అవగాహనకు వచ్చేశారట. 

మాధవన్‌, సూర్య, సిద్ధార్థ్.. ఇలా తన స్కూల్‌ హీరోలను ఎంపిక చేసుకుంటున్నారట. దర్శకుల విషయంలో అంతే అని వేరేగా చెప్పక్కర్లేదనుకుంటా. సంగీత దర్శకులు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. అన్నట్లు ఈ సిరీస్‌కు ‘నవరస’ అని పేరు పెడుతున్నారని తెలుస్తోంది.  ఈ లెక్కన ఒక్కో ఎపిసోడ్‌ ఒక్క రసం నేపథ్యంలో ఉండబోతుందేమో. చూద్దాం.. మణిరత్నం వెబ్‌సిరీస్‌ ఎలా ఉంటుందో? అయితే ఈ వెబ్‌సిరీస్‌ కేవలం తమిళానికే పరిమితమయ్యే అవకాశం లేదు. తెలుగులో కూడా డబ్‌ చేస్తారని అంటున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.