వెంచర్‌కు లంచం.. ఏసీబీ వలలో సర్పంచ్‌
close

తాజా వార్తలు

Updated : 06/03/2021 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంచర్‌కు లంచం.. ఏసీబీ వలలో సర్పంచ్‌

పూడూరు: వెంచర్‌కు అనుమతి ఇవ్వడానికి రూ.13 లక్షలు లంచం అడిగిన సర్పంచ్‌ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మహబూబ్ ఆలంఖాన్ అనే వ్యక్తికి 5 ఎకరాల భూమి ఉంది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న తన స్థలంలో లే అవుట్‌ వేసేందుకు అనుమతి కోరుతూ మన్నెగూడ గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. వెంచర్‌కు అనుమతి ఇవ్వాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని సర్పంచ్‌ వినోద్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశాడు. రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పుకున్న ఆలంఖాన్‌ వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హైదరాబాద్‌ అప్పా కూడలి వద్ద రూ.13 లక్షల లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలోని బృందం వినోద్‌ గౌడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వినోద్‌గౌడ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఏసీబీ అధికారులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని